అట్రాక్ట్ చేస్తున్న జయవాణి బోల్డ్ లుక్స్.. ఆ గుహలో ఒంటరిగా ఏం చేస్తుందో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-10-03 12:40:08.0  )
అట్రాక్ట్ చేస్తున్న జయవాణి బోల్డ్ లుక్స్.. ఆ గుహలో ఒంటరిగా ఏం చేస్తుందో తెలుసా?
X

దిశ, సినిమా : మాస్ హీరో రవితేజ, వంశీ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘టైగర్‌ నాగేశ్వర రావు’. ఈ సినిమా రిలీజ్ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇందులో బాలీవుడ్ భామ నుపుర్ సనన్‌ హీరోయిన్‌గా నటించగా అనుకీర్తి వ్యాస్ ఇందులో జయవాణి పాత్ర పోషించింది. అయితే తాజాగా జయవాణికి సంబంధించిన లుక్ విడుదల చేయగా సూపర్ హాట్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది నటి. ఏదో గుహలో దేనికోసమే తదేకంగా చూస్తూ కాస్త బోల్డ్‌గా ఉన్న ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక అనుపమ్‌ ఖేర్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిగా, మురళీ శర్మ విశ్వనాథ శాస్త్రిగా నటించగా ఈ పాత్రలకు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే సినిమాపై హైప్ పెంచుతున్నాయి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా అక్టోబర్ 20న విడుదలకానుంది.

Advertisement

Next Story