- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబానీ పెళ్లిలో పెర్ఫార్మెన్స్ కు కోట్లు వసూలు చేసిన ఇంటర్నేషనల్ సింగర్..
దిశ, సినిమా : ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ పార్టీ గుజరాత్ జామ్ నగర్‌లో ఎంతో గ్రాండ్ గా జరుగుతుంది. దీంతో దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, సినీ తారలు, క్రికెటర్లు ఈ గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగం అయ్యారు. అయితే ఈ వేడుకలో అతిథులను అలరించడానికి కొన్ని స్పెషల్ పర్ఫార్మెన్స్‌లను కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ స్టార్ సింగర్ కూడా ప్రదర్శన ఇచ్చింది. అయితే దానికి ఆమె భారీగా డబ్బులు వసూలు చేసి ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
అసలు విషయంలోకి వెళితే.. మనకు తెలిసి సింగర్ ఓ పాట కచేరికి ఎంత తీసుకుంటారు? లక్ష, రెండు, ఐదు.. పది లక్షలు.. మంచి ఫామ్ ఉన్న సింగర్ అయితే కోటి తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ అమెరికన్ గాయని రాబిన్ రిహన్న ఫెంటీ మాత్రం అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫెస్టివిటీస్ లో పెర్ఫార్మెన్స్‌కి అక్షరాల రూ. 50 కోట్లు తీసుకుందని సమాచారం.
కాగా.. ఈ అమెరికన్ గాయని రాబిన్ రిహన్న ఫెంటీ.. గురించి పరిచయం అక్కర్లేదు. నిండా 40 ఏళ్లు కూడా లేని ఈ బార్బాడియన్ గాయని.. వ్యాపారవేత్త.. నటి కూడా. ఇక రాబిన్ ఆటా పాటాకు చిత్ర పరిశ్రమలో తిరుగులేదు. ఇమె గ్రామీ అవార్డు గ్రహీత కూడా. అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న సింగర్ కనుక.. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ పార్టీ లో పెర్ఫార్మెన్స్‌కి అంత డిమాండ్ చేసింది.