ఆసక్తికరంగా నవీన్ చంద్ర-కలర్స్ స్వాతి ‘మంత్ ఆఫ్ మధు’ ట్రైలర్ రిలీజ్

by Hamsa |
ఆసక్తికరంగా నవీన్ చంద్ర-కలర్స్ స్వాతి ‘మంత్ ఆఫ్ మధు’ ట్రైలర్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర కలిసి నటించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. ఈ సినిమా వచ్చే నెల అక్టోబర్ 6న థియేటర్స్‌లో విడుదల కానుంది. భానుమతి అండ్ రామకృష్ణతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ నగోతి ఈ ఎమోషనల్ డ్రామాకు దర్శకుడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ జనాల్లో ఆసక్తిని పెంచాయి. తాజాగా, మంత్ ఆఫ్ మధు ట్రైలర్ రిలీజ్ అయింది. అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ మధు(శ్రేయ నవిలే) ఊబకాయంతో బాధపడుతూ ఉంటుంది. బోలెడు ఆత్మవిశ్వాసం ఉన్నా లావుగా ఉన్న కారణంగా తల్లి(మంజుల)సైతం అవమానిస్తూ ఇబ్బంది పెడుతుంది.

ఈ క్రమంలో తాగుడుకు బానిసైన ఓ మధ్య వయస్కుడు(నవీన్ చంద్ర) పరిచయమవుతాడు. తన గతాన్ని వివరిస్తాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అందమైన అమ్మాయి(స్వాతి రెడ్డి)కి విడాకులు ఇవ్వాలనుకునే దాకా కుటుంబ పరిస్థితులు ఎలా దారి తీశాయో చెబుతాడు. అసలు మధుకి అతనికి స్నేహం ఎలా కుదిరింది, రెండు కథలు ఏ మజిలీకి దారి తీశాయనేదే అసలు స్టోరీ. డైలాగులు, భావోద్వేగాలు అన్నీ మహిళల కోణంలో సాగాయి. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా ఎక్కువగా మహిళలను ఆకట్టుకునేలా కనిపిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed