Deepika Padukone-Ranveer: దీపికా పదుకొణెకు ఎవరు పుట్టారో రివీల్ చేస్తూ రణ్‌వీర్ సింగ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..

by Hamsa |   ( Updated:2024-09-08 12:01:15.0  )
Deepika Padukone-Ranveer: దీపికా పదుకొణెకు ఎవరు పుట్టారో రివీల్ చేస్తూ రణ్‌వీర్ సింగ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె- రణ్‌వీర్ సింగ్ 2018లో ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు ఇటలీలోని లేక్ కోమోలో వివాహ బంధం లోకి అడుగుపెట్టారు. అయితే ఈ జంట పెళ్లైన నాలుగేళ్లకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రెగ్నెన్సీకి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే దీపికా పదుకొణె బేబీ బంప్‌తో ఉన్నప్పటికీ కల్కి మూవీలో నటించి మెప్పించింది.

ఇటీవల ఆమె ముంబైలోని సిద్ధి వినాయక ఆలయానికి భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి వెల్లిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ రోజు దీపికా పదుకొణె ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ పోస్ట్ పెట్టారు. ‘‘మహాలక్ష్మి వచ్చేసింది. ఇక్కడ రాణి ఉంది’’ అని రాసుకొచ్చాడు. ఈ రోజు సెప్టెంబర్ 8 తేదీన మాకు పాప పుట్టింది అని తెలిపాడు. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement

Next Story