Bandi Sanjay: పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Anjali |   ( Updated:2024-09-02 14:57:27.0  )
Bandi Sanjay: పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. సెప్టెంబరు 2 కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన రోజు ఇది. కాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులంతా సోషల్ మీడియా వేదికన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు కూడా నెట్టింట పవన్ విష్ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పవన్ కల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏపీ డిప్యూటీ సీఎం కు స్పెషల్ గా బర్త్ డే విషెష్ చెప్పారు. ‘సంకల్పమే బలంగా, జనహితమే ధ్యేయంగా జనసంక్షేమం కోసం తపిస్తున్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి వారి కృపతో ఎల్లప్పుడు ప్రజా సేవలో తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’. అంటూ బండి సంజయ్ సోషల్ మీడియా వేదికన పోస్ట్ చేశారు.

Advertisement

Next Story