Rahasyam Idam Jagath: ఆసక్తికరంగా ‘రహస్యం ఇదం జగత్‌’ గ్లింప్స్‌..

by sudharani |
Rahasyam Idam Jagath: ఆసక్తికరంగా ‘రహస్యం ఇదం జగత్‌’ గ్లింప్స్‌..
X

దిశ, సినిమా: రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రహస్యం ఇదం జగత్‌’. ఈ చిత్రాన్ని సింగిల్‌ సెల్‌ యూనివర్శ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతుందున్న ఈ మూవీని పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘రహస్యం ఇదం జగత్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ.. గ్లింప్స్ విడుదల చేశారు చిత్రబృందం.

ఈ మేరకు నవంబరు 8న ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తుండగా.. గ్లింప్స్ ఆసక్తికరంగా మారింది. మన పురాణాలు, ఇతిహాసాల్లోని ఆసక్తికరమైన పాయింట్‌ను తీసుకొని ఈ చిత్రం రూపొందించినట్లుగా తెలుస్తుంది గ్లింప్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. ముఖ్యంగా మన శ్రీచక్రం గురించి చెబుతున్న పాయింట్‌ అందరిలోనూ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలాజికల్‌ థ్రిల్లర్స్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని అని చెప్పడంలో సందేహం లేదంటున్నారు మేకర్స్‌.



Advertisement

Next Story

Most Viewed