‘మెట్ గాలా’ 2023: అబ్బురపరిచిన భారతీయ నటీమణులు

by Anjali |   ( Updated:2023-05-02 07:39:43.0  )
‘మెట్ గాలా’ 2023: అబ్బురపరిచిన భారతీయ నటీమణులు
X

దిశ, సినిమా: ‘మెట్ గాలా’ 2023 ఈవెంట్‌లో భారతీయ నటీమణులు సరికొత్త అవతార్‌లో దర్శనమిచ్చి అబ్బురపరిచారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్‌ వేడుకగా పేరుగాంచిన ఈ ఈవెంట్ న్యూయార్క్‌ నగరంలోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌‌లో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ప్రారంభమైన కార్యక్రమానికి బాలీవుడ్‌ నుంచి అలియా భట్, గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా హాజరై సందడి చేశారు. ప్రఖ్యాత ఫ్యాషన్‌ డిజైనర్లు రూపొందించిన దుస్తుల్లో రెడ్‌కార్పెట్‌పై హొయలు పోయారు. ఈ మేరకు తెల్లటి స్లీవ్‌లెస్‌ గౌనులో అలియా భట్‌ మెరిసిపోగా.. తన భర్త నిక్‌ జొనాస్‌తో కలిసి వైట్‌ అండ్‌ బ్లాక్‌ కాంబినేషన్‌లో కనిపించిన ప్రియాంక అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక అమెరికన్ మోడల్ కెండల్ జెన్నర్ ప్యాంట్‌లెస్ టాప్‌లో అట్రాక్ట్ చేయగా ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్‌ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి: Rashmika Mandanna : అభిమానులకు సారీ చెప్పిన రష్మిక.. అదే కారణమట!

Read more :

Priyanka Chopra :204 కోట్ల విలువైన నెక్లెస్ ధరించిన ప్రియాంక చోప్రా

Advertisement

Next Story