వివాదంలో ‘భోళాశంకర్’.. రూ.30 కోట్లు తీసుకుని మోసగించారంటూ..

by Anjali |   ( Updated:2023-08-09 07:34:06.0  )
వివాదంలో ‘భోళాశంకర్’.. రూ.30 కోట్లు తీసుకుని మోసగించారంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భోళాశంకర్’ చిత్రం ఈ నెల (ఆగస్టు)11న విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా ఈ సినిమాకు నిర్మించిన అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ గతంలో ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో నమ్మించి మోసం చేశారని విశాఖపట్నంకు చెందిన ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ ఆరోపించారు. ఆ మేరకు బుధవారం(ఆగస్టు 9) తనకు జరిగిన అన్యాయంపై ఆయన ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేశారు.

‘‘ ఏజెంట్ మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను మూడు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలకు 5 ఏళ్ల పాటు నాకు చెందిన గాయత్రి దేవి ఫిలిమ్స్‌కు అందజేస్తామని నాకు అగ్రిమెంట్ రాసి ఇచ్చి.. రూ. 30 కోట్లు తీసుకుని మరీ నన్ను దారుణంగా మోసం చేశారు. వారికి మనీ ఇచ్చినట్లు నా దగ్గర పక్కా ఎవిడెన్స్ కూడా ఉంది. సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను విడుదల చేసే టైంలో కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే అందజేసి, అగ్రిమెంట్‌కు తూట్లు పొడిచారు. ఆ తర్వాత మే 1వ తేదీన హైదరాబాద్‌లోని వారి ఆఫీస్‌కు వెళ్లి గరికపాటి కృష్ణ కిషోర్ ను కలిశాను.

ఈ మూవీకి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. సినిమా ఫ్లాప్ అయ్యిందని చెప్పారు. మరుసటి రోజు ఆఫీసుకు రండి అండర్ టేకింగ్ లెటర్ ఇస్తామన్నారు. నాకు అండర్ టేకింగ్ లెటర్ ఇవ్వడంతో మనీ ఎలాగైనా వస్తాయన్న నమ్మకంతో తిరిగి వైజాగ్ వెళ్ళిపోయాను. ఇంతవరకూ మనీ రాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాను. నాకు ఎలాగైనా న్యాయం జరగాలని అడ్వొకేట్ కేశాపురం సుధాకర్‌ను ఆశ్రయించాను. వారిపై క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. అలాగే ఫైనాన్సియర్స్ అందరి మీద ఈడీకి కంప్లైంట్ చేశాను.’’ అంటూ బత్తుల సత్యనారాయణ ప్రెస్ నోట్‌లో రాసుకొచ్చారు.

Read More:

Megastar Chiranjeevi వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు సీరియస్!

గుడివాడలో మెగా అభిమానుల ఆందోళన...పలువురు అరెస్ట్

Advertisement

Next Story