‘కస్టడీ’కి ఇళయరాజా సంగీతం అందించడం సంతోషంగా ఉంది: నాగ చైతన్య

by Vinod kumar |
‘కస్టడీ’కి ఇళయరాజా సంగీతం అందించడం సంతోషంగా ఉంది: నాగ చైతన్య
X

దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కించిన ద్విభాషా చిత్రం ‘కస్టడీ’. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన చిత్రం ఇటివలే షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇదీలావుంటే.. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాస్ట్రో ఇళయరాజా ‘రాజా లైవ్ ఇన్ కన్సర్ట్’ కోసం హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా ‘కస్టడీ’ యూనిట్ ఇళయరాజాను కలిసి అభినందించగా.. ఆ ఫొటోలను నాగ చైతన్య నెట్టింట పోస్ట్ చేస్తూ ఫ్యాన్ బాయ్ మూమెంట్‌ని పంచుకున్నాడు.

‘మ్యాస్ట్రో ఇళయరాజా సర్‌ని కలవడం గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. ఆయన పాటలు వినుకుంటూ జీవితంలో చాలా ప్రయాణాలు చేశాను. ఇప్పుడు రాజా సర్ ‘కస్టడీ’ చిత్రం కోసం కంపోజ్ చేయడం హ్యాపీగా ఉంది’ అన్నాడు. ఇక కృతి శెట్టి కథానాయికగా నటించిన చిత్రంలో విలన్ పాత్రలో అరవింద్ స్వామి, పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో ప్రియమణి కనిపించనుండగా మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

Advertisement

Next Story