Ilayaraja కారణంగా నా కెరీర్ నాశనమైంది.. లేడీ సింగర్

by Anjali |   ( Updated:2023-06-25 15:19:45.0  )
Ilayaraja కారణంగా నా కెరీర్ నాశనమైంది.. లేడీ సింగర్
X

దిశ, సినిమా: సంగీత దర్శకుడు ఇళయరాజాపై సింగర్ మిన్మినీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘నా కెరీర్ ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడానికి, నాశనం కావడానికి ఇళయరాజా కారణం. ఎందుకంటే ముందునుంచి నేను ఇళయరాజా వద్ద ఉండే సింగర్స్ టీంలో ప్లే బ్యాక్ సింగర్‌ను. అయితే ‘చిన్ని చిన్ని ఆశ’ పాట పాడిన తర్వాత ఒక్కసారిగా నాకు గుర్తింపు రావడంతో ఇళయరాజా గారు నన్ను స్టూడియోకి పిలిచారు. నా దగ్గర పనిచేస్తూ వేరే సంగీత దర్శకుల దగ్గర పాట ఎందుకు పాడారు? అలా పాడటానికి వీలు లేదని తిట్టారు. ఆయనకు భయపడి ఇతర దర్శకులు కూడా నాకు అవకాశాలు ఇవ్వలేదు. అందుకే నాలో ఇంత టాలెంట్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

Next Story