అతన్ని చూస్తే గట్టిగా పట్టుకొని అలా చేయాలనిపిస్తుంది.. నిహారిక షాకింగ్ కామెంట్స్.. పెళ్లికి హింట్ ఇచ్చేసిందిగా?

by Kavitha |
అతన్ని చూస్తే గట్టిగా పట్టుకొని అలా చేయాలనిపిస్తుంది.. నిహారిక షాకింగ్ కామెంట్స్.. పెళ్లికి హింట్ ఇచ్చేసిందిగా?
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ‘కమిటీ కుర్రోళ్ళు’ అనే మూవీతో నిర్మాతగా మారింది. అయితే ఈ సినిమా ఆగస్టు 9న థియేటర్లలో రాబోతుంది. ఈ తరుణంలో ఆమె కొన్ని చానళ్ళకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా ప్రమోషన్స్ చేస్తోంది.

ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక.. తన ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తుల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ చిరంజీవి గురించి ఒక్కమాటలో చెప్పండి అని అడగగా.. మా పెద్దనాన్న చాలా హార్డ్ వర్కర్ అని చెప్పింది. పవన్ కళ్యాణ్ గురించి అడగగా మా బాబాయ్‌కి విల్ పవర్ ఎక్కువగా ఉంటుందని అన్నది.

అదే విధంగా అల్లు అర్జున్ గురించి అడగగా.. ఆయన నవ్వడం నాకు చాలా ఇష్టమని చెప్పింది. అలాగే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి అడగగా.. కాస్త ఆలోచించి నిహారిక మా బావని చూడగానే గట్టిగా పట్టుకొని హగ్ చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పింది. ప్రస్తుతం ఆమె మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆయన్ని పెళ్లి చేసుకుంటావా అని.. పెళ్లికి హింట్ ఇచ్చేసిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

Advertisement

Next Story