అనంత్- రాధికా పెళ్లి‌లో ఉపాసన అవుట్ ఫిట్ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Kavitha |   ( Updated:2024-07-18 09:46:47.0  )
అనంత్- రాధికా పెళ్లి‌లో ఉపాసన అవుట్ ఫిట్ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
X

దిశ, సినిమా: అపర కుబేరుడు, ప్రముఖ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడుకు, రాధికా మర్చంట్‌కి జూలై 12న దేశం అంతా ఆశ్చర్యపోయేలా ఆడంబరంగా ముంబైలో వీరిద్దరి వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ మహోత్సవానికి ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు సైతం క్యూ కట్టారు. టాలీవుడ్ నుంచి కూడా మహేష్ ,రామ్ చరణ్, వెంకటేష్ వంటి స్టార్స్ ఫ్యామిలీలతో వెళ్లారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా హాజరయ్యారు. రామ్ చరణ్, ఉపాసన సంప్రదాయ దుస్తులు ధరించి ఈ పెళ్లి వేడుకలో కనువిందు చేశారు. ఈ క్రమంలో కొన్ని ఫొటోలకు పోజులిచ్చారు. కాగా, రామ్ చరణ్, ఉపాసనలను అంబానీ వర్గాలు ఆత్మీయంగా స్వాగతించాయి.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో రామ్ చరణ్-ఉపాసన ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా ఉపాసన తెలుగింటి సాంప్రదాయం ఉట్టిపడేలా చీరకట్టులో ఎంతో అందంగా కనిపించడంతో చీర ధర ఎంత అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె జయంతి రెడ్డి రూపొందించిన బీజ్ ఎంబ్రాయిడరీ సిల్క్ అనార్కలి సెట్‌ను ధరించారని తెలుస్తోంది. ఈ సెట్ ధర అక్షరాలా రూ. 1,49,900. దీంతో నెటిజన్లు ఏంటి ఆ శారీ అంత ఖరీదా అని నోరెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం ఉపాసన శారీ కాస్ట్ నెట్టింట హాట్ టాఫిక్‌గా అయ్యింది.






Advertisement

Next Story

Most Viewed