- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Simran: ఇక అలాంటివి చేస్తే ఊరుకునేది లేదు.. స్టార్ హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్ (పోస్ట్)
దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో సిమ్రాన్ ఒకరు. స్టార్ హీరోల సరసన పలు హిట్ చిత్రాల్లో నటించిన ఆమె అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇటీవల సిమ్రాన్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో మరోసారి వెండితెరపై సందడి చేస్తోంది. ఈ క్రమంలో ఆమె స్టార్ హీరోల సరసన నటించాలనుకుంటుందని పలు పుకార్లు షికార్లు చేశాయి.
తాజాగా, సిమ్రాన్ క్లారిటీ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ సెన్సేషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ఇతరులు మిమ్మల్ని మానసికంగా తారుమారు చేయడం ఆ రూమర్స్‌ను స్నేహితులు నమ్మడం చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. ఇప్పటివరకూ నేను సైలెంట్‌గా ఉన్నా. ఇక నుంచి అలా చేస్తే ఊరుకునేది లేదు. ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నా ఏ పెద్ద హీరోతోనూ పనిచేయాలనే కోరిక నాకు లేదు. ఇప్పటికే వారితో చాలా సినిమాల్లో నటించా ఇప్పుడు నా లక్ష్యాలు చాలా భిన్నంగా ఉన్నాయి. నా పరిమితులు నాకు తెలుసు కాబట్టి ఒకరితో లేదా మరొకరితో ముడిపెడుతూ వార్తలు రాయకండి.
ఇన్నేళ్ల నుంచి నాపై సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉన్నా నేను సైలెంట్ ఉన్నా. నాకంటూ ఒక ఆత్మగౌరవం ఉంది. దానికే నా మొదటి ప్రాధాన్యత ఇస్తా. ఇది చాలా శక్తివంతమైన పదం ఇకనైనా ఆపండి అని చెబుతున్నా. ఈ ప్రచారాలకు ఫుల్స్టాప్ పెట్టడం కోసం ఎవరూ నన్ను సంప్రదించలేదు ఆ ప్రయత్నం కూడా చేయలేదు. నా మనో భావాలు ఎవరూ పట్టించుకోలేదు. నా పేరు లేదా ఫేమ్‌ను ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు. ఎప్పుడూ నేను సరైన దాని కోసం నిలబడ్డా. ఇండస్ట్రీ నుంచి కూడా నేను అదే కోరుకున్నా. నా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోన్న వారు నాకు వెంటనే క్షమాపణలు చెప్పాలి’’ అని రాసుకొచ్చింది.
(Credits to Simran's Instagram ID)