- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాలీవుడ్ డైరెక్టర్లకు ఇష్టమైన హీరోయిన్లు వీళ్లే.. వీరి కాంబోలో హిట్ పక్కా మరీ?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్లకు- హీరో, హీరోయిన్లకు మధ్య హిట్ కాంబినేషన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే దర్శకులకు ఇష్టమైన హీరోయిన్లు కూడా వీరే.. ఆ కలయికలో వచ్చిన సినిమాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంగళవారం’ చిత్రంతో పాయల్ రాజ్ పుత్ 6 ఏళ్ల తర్వాత హిట్ అందుకుంది. ఈ డైరెక్టర్, హీరోయిన్ కాంబోలో ఫస్ట్ వచ్చిన RX100 ఏ రేంజ్‌లో బాక్సాఫీసును ఊపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మళ్లీ అదే కాంబో రిపీట్ చేస్తూ హిట్ అందుకోవడం విశేషం. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి-అనుష్క శెట్టి కాంబోలో వచ్చిన ‘బహుబలి’ సినిమా. ‘మజిలి, ‘ఖుషి’తో శివనిర్వాణ - సమంత రెండు సార్లు కలిసి పనిచేశారు. వీరిది సక్సెస్ ఫుల్ కాంబినేషనల్ అని ఫ్రూవ్ చేశారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-పూజా హెగ్దే.. ‘అరవింద సమేత, అల వైకుంఠపురంలో. అలాగే సాయిపల్లవి నటించిన ఫిదా, లవ్ స్టోరీ చిత్రాలు ఓ రేంజ్‌లో హిట్ అయ్యాయి. వీటికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి ‘బృందావనం’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో వెంటనే ‘ఎవడు’ సినిమాలో మళ్లీ కాజల్‌లో మూవీ తీశాడు. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మాలినేని-శృతి హాసన్ కలయికలో వచ్చిన ‘క్రాక్, వీరసింహారెడ్డి’ చిత్రాలు కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి. దీంతో సోషల్ మీడియాలోని నెటిజన్లు.. ఒక సినిమా హిట్ కావడంతో సెంటిమెంట్‌గా రిపీట్ కాంబోలో మూవీస్ తీస్తున్నారు. మళ్లీ ఈ దర్శకులకు ఈ హీరోయిన్లంటే చాలా అభిమానం.’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.