- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నా భార్య సినిమాలలోకి వచ్చి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేది.. బాలయ్య అల్లుడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ అందరికీ సుపరిచితమే. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. 60 ఏళ్ల వయసులో ఎంతో మంది హీరోలు సినిమాలు చేస్తున్న బాలకృష్ణ స్పెషల్. తన డైలగ్‌లతో, నటనతో జై బాలయ్య అనిపించుకున్నాడు. ఇక బాలయ్య తనయుడు మోక్షజ్ఞ త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే విషయం తెలిసిందే. అతని ఎంట్రీ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే తన కొడుకు కంటే చిన్న కూతురు తేజస్విని ముందుగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారని తెలిసిందే. ఆమె డైరెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రాకపోయిన తెర వెనుక మాత్రం బాలయ్య సినిమాలకు ఎంతో కృషి చేస్తూ తన తండ్రి విజయాలకు కారణమౌతుంది.
అదేవిధంగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ కార్యక్రమం అంత మంచి సక్సెస్ అయ్యిందంటే దాని వెనుక తేజస్విని కృషి చాలా ఉందనే చెప్పాలి. ఇక ఈమె భర్త శ్రీ భరత్ ప్రముఖ విద్యావేత్త. ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా కూడా గెలిచారు. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇతను భార్య తేజస్విని గురించి చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తేజస్విని చాలా టాలెంటెడ్ అండ్ క్రియేటివిటీ కలిగిన అమ్మాయి అని.. ఆమె కనుక ఇండస్ట్రీలోకి వచ్చి ఉంటే కచ్చితంగా స్టార్ హీరోయిన్ అయ్యేదని శ్రీ భరత్ అన్నారు. అందంలో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని తేజస్విని కనుక హీరోయిన్‌గా వచ్చి ఉంటే మాత్రం నిజంగానే స్టార్ హీరోయిన్ అయ్యి ఉండేవారు అంటూ అభిమానులు కూడా ఈ విషయంపై కామెంట్స్ చేస్తున్నారు.