లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకోకపోతే.. ఆ టీడీపీ నేత కుమార్తెనే చేసుకునేవాడిని: ఎన్టీఆర్

by Anjali |   ( Updated:2023-06-21 09:44:09.0  )
లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకోకపోతే.. ఆ టీడీపీ నేత కుమార్తెనే చేసుకునేవాడిని: ఎన్టీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో అడుగుపెట్టాక తారక్ తలరాత మారిపోయింది. పెళ్లయ్యాక ఈ హీరో వరుస పెట్టి విజయాలు అందుకుంటున్నాడు. అయితే ప్రణతిని వివాహం చేసుకోకముందు టీడీపీ పార్టీకి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నేత కుమార్తెతో ఎన్టీఆర్ పెళ్లి ఫిక్స్ అయ్యిందట. ఈ సంబంధాన్ని స్వయంగా చంద్రబాబే దగ్గరుండి కుదర్చాడట. ఆ అమ్మాయి కూడా ఈ హీరోకు బాగా నచ్చింది. కానీ తారక్ తల్లికి మాత్రం ఆ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నచ్చక రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత చంద్రబాబు దగ్గరి బంధువైన లక్ష్మి ప్రణతితో ఎన్టీఆర్ పెళ్లి జరిగింది. ఒకవేళ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ గానీ టీడీపీ నేత కూతురు సంబంధాన్ని ఓకే అంటే ఎన్టీఆర్ పెళ్లి ఆమెతోనే జరిగేదని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

Read more : చెర్రీ కూతురు జాతకం అద్భుతం.. పుట్టిన గంటల్లోనే చిరంజీవికి కోట్ల లాభం

Advertisement

Next Story