OTT: హీరో ఫాదర్, హీరోయిన్ మదర్ కలిసి లవ్ చేసుకుంటే.. ఓటీటీలో మైండ్ బ్లోయింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

by Kavitha |
OTT: హీరో ఫాదర్, హీరోయిన్ మదర్ కలిసి లవ్ చేసుకుంటే.. ఓటీటీలో మైండ్ బ్లోయింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
X

దిశ, సినిమా: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా పెరిగిపోయిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో అన్ని జోనర్లకు సంబంధించిన సినిమాలు ఉంటాయి. కరోనా వచ్చీనప్పటినుంచి ఎక్కువ మంది థియేటర్స్‌కి వెళ్లి మూవీ చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. ఏంచక్కా ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీ మొత్తం సినిమా చూడటానికి ఇష్టపడుతున్నారు. దీంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వారు కూడా చిత్రాలను త్వరత్వరగా స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ‌లోకి కామెడీ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో పొట్ట చెక్కలయ్యంత కామెడీ ఉంటుంది అని అనడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు. పైగా ఈ సినిమా థియేటర్‌లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారు మేకర్స్. మరి ఇంతకీ ఈ సినిమా పేరు, స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బినోయ్ కే గాంధీ డైరెక్షన్‌లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనా టాండన్, పార్థ్ సమ్తాన్, ఖుశాలీ కుమార్ ప్రధాన పాత్రలలో నటించిన మూవీ 'ఘూడ్‍చాడీ'. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను బాగానే మెప్పించింది. అయితే ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అయినా జియో సినిమాలో ఆగస్టు 9 నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ హిందీలో మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక రానున్న రోజుల్లో మిగిలిన వెర్షన్స్‌లోకి తీసుకొని వస్తారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే..

ఈ సినిమా అంతా కూడా చిరాగ్ , బేబికా అనే ఇద్దరి ప్రేమ చుట్టూ కొనసాగుతుంది. వీరిద్దరూ ప్రేమలో పడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని పెద్దలకు కూడా చెప్పాలని నిర్ణయించుకుంటారు. అయితే ఇక్కడే ఉంటుంది అసలు సిసలైన ట్విస్ట్. అదేంటంటే.. వీరిద్దరి కంటే ముందు చిరాజ్ తండ్రి, బేబీకా తల్లి ప్రేమించుకున్నారనే విషయం బయటపడుతుంది. దీంతో వీరి ప్రేమ వ్యవహారానికి బ్రేకులు పడతాయి. అప్పుడు చిరాజ్ , బేబీకా ఏం చేస్తారు ? తల్లిదండ్రుల ప్రేమ వీరి ప్రేమకు అడ్డుగా నిలుస్తుందా ? ఆ తర్వాత ఏం జరుగుతుంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

Advertisement

Next Story