తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి iBomma వార్నింగ్.. ఏం చేసుకుంటారో చేసుకోమంటూ పోస్ట్

by Anjali |   ( Updated:2023-09-07 10:44:52.0  )
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి iBomma వార్నింగ్.. ఏం చేసుకుంటారో చేసుకోమంటూ పోస్ట్
X

దిశ, సినిమా: తెలుగు సినీ ప్రేమికులకు ప్రముఖ మూవీ వెబ్సైట్ iBOMMA గురించి చెప్పక్కర్లేదు. ఐ బొమ్మను పేదవాడి ఓటీటీ అని చెప్పాలి. కొత్తగా వచ్చిన సినిమాలు థియేటర్‌లో విడుదలైన వన్ డేలోనే నయా పైసా ఖర్చు లేకుండా ఈ వెబ్‌సైట్‌లో చూడోచ్చు. కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చిన వెంటనే క్వాలిటీ ప్రింట్‌ను ఐ బొమ్మలో పెట్టేస్తూ ఉంటారు. అయితే ఈ సైట్‌పై చాలా గొడవలు జరుగుతున్నప్పటికీ iBOMMA నిర్వాహకులు స్పందించడం లేదు. అంతేకాదు తాజాగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి iBomma వార్నింగ్ ఇస్తూ ఒక నోట్ పోస్ట్ చేసింది.

‘ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్‌కు ప్రింట్ అమ్మిన తర్వాత కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ల మీద కాకుండా.. మీ OTT రెవిన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు.

- హీరోలకు అంత రెమ్యూనరేషన్ అవసరమా? అది మీ కొడుకులైనా ఎవరైనా కావచ్చు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది వున్నారు. వాళ్లు ఏమైపోతారని కబుర్లు చెప్పకండి. వాళ్లకు మీరు ఇచ్చే డబ్బులు, బయట ఏ కూలి పని చేసిన వస్తాయి. కానీ మీ హీరోహీరోయిన్లకు వస్తాయా.

- సినిమా బడ్జెట్‌లో ఎక్కువ శాతం రెమ్యూనరేషన్స్, విదేశాల్లో షూటింగ్‌లకు, యాత్రల కోసం ఖర్చుపెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా? ఇక్కడ వాళ్లకు ఉపాధి దొరుకుతుంది.

- అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీకి దానిని మా మీద రుద్ది ఎక్కువకు అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్‌ను కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతివాడే బాధపడుతున్నాడు.

- అందుకే ఫస్ట్ కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్‌సైట్ మీద మీ దృష్టి పెట్టండి. ఐబొమ్మ అన్నది సిగిరేట్ నుంచి ఈ సిగిరెట్‌కు యూజర్స్‌ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్‌కు మా రియాక్షన్ ఉంటుంది. ఈ మధ్యలో వేరే హీరో కూడా టార్గెట్ కావడం ఇష్టం లేదు. మేము స్వతహాగా వెబ్‌సైట్ నుంచి తొలిగిస్తున్నాం. ఇప్పుడు వెంటనే డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు ప్రభావం చూపించినట్లు ఉంటుంది. అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత తీసేయ్యాలి అనుకుంటున్నాం. మా వెబ్‌సైటు మీద ఫోకస్ చేయడం ఆపండి. లేదంటే మేము మీ మీద ఫోకస్ చేయాల్సివస్తుంది. అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed