నేను బతికున్నంతవరకు శ్రీదేవి బయోపిక్ రానివ్వను.. బోనీ కపూర్ షాకింగ్ కామెంట్స్!

by sudharani |   ( Updated:2024-04-04 14:27:56.0  )
నేను బతికున్నంతవరకు శ్రీదేవి బయోపిక్ రానివ్వను.. బోనీ కపూర్ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు స్టార్స్‌గా గుర్తింపు పొందిన నటీనటులు, క్రీడాకారులపై కూడా ఇప్పటి వరకు ఎన్నో బయోపిక్స్ వచ్చాయి. అవన్ని కూడా దాదాపుగా హిట్‌గా నిలిచాయి. ఇందులో సీనియర్ నటి సావిత్రి బయోపిక్ ఒకటిగా నిలిచింది. ఈ బయోపిక్‌లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ క్రమంలోనే అలనాటి అందాల తారా, సీనియర్ హీరోయిన్ శ్రీదేవి బయోపిక్ కూడా వస్తున్నట్లు ఎన్నో వార్తలు వినిపించాయి. దీనికి తాజాగా క్లారిటీ ఇచ్చాడు బోనీ కపూర్.

అలనాటి అందాల తారా శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాల నటిగానే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. అప్పట్లో తెలుగు తెరను ఓ ఊపు ఊసేశారు. తన అందం, అభినయం, నటనతో ఎంతో మంది అభిమానుల మనసులు గెలుచుకున్న ఈ బ్యూటీ.. అనూహ్య రీతిలో ఈలోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆమె సినీ లైఫ్ గురించి అందరికీ తెలసిందే, కానీ పర్శనల్ లైఫ్‌లో శ్రీదేవి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని సమాచారం. అయితే.. శ్రీదేవి చనిపోయినప్పటి నుంచి ఆమె బయోపిక్ గురించి చాలా వార్తలు వస్తున్నాయి. శ్రీదేవి బయోపిక్‌లో నటించేది ఆ నటి, ఈ నటి అంటూ నెట్టంట టాక్ కూడా వచ్చింది.

దీనిపై స్పందించిన బోనీ కపూర్ మాట్లాడుతూ.. ‘శ్రీదేవి చాలా ప్రవైట్ పర్శన్. ఆమె వ్యక్తిగత జీవితాన్ని బయోపిక్ రూపంలో పబ్లిక్‌లో పెట్టే హక్కు ఎవరికీ లేదు. నేను బతికున్నంత వరకూ ఆమె బయోపిక్ తెరకెక్కించడానికి ఎవరికి అనుమతి ఇవ్వను’ అని ఓ ఇంగ్లీష్ మీడియా సమావేశంతో బోని కపూర్ చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో కొంత మంది పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుంటే.. మరికొందరు మాత్రం నెగిటివ్‌గా రిప్లై ఇస్తున్నారు.

Read More..

షారుఖ్ మీరనుకున్నంత మంచోడేమీ కాదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story