కమల్ హాసన్ ఇచ్చిన ఆ గిఫ్ట్‌ నాకొక తీపి జ్ఞాపకం: దేవి శ్రీ ప్రసాద్

by sudharani |   ( Updated:2023-01-05 14:01:56.0  )
కమల్ హాసన్ ఇచ్చిన ఆ గిఫ్ట్‌ నాకొక తీపి జ్ఞాపకం: దేవి శ్రీ ప్రసాద్
X

దిశ, సినిమా: టాలీవుడ్లో సంగీత దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దేవి శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్‌గా 'పుష్ప' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం 'పుష్ప 2' సినిమా పనులతో బిజీగా ఉన్నారు. ఇకపోతే దేవిశ్రీకి లెజెండరీ నటుడు కమల్ హాసన్ అద్భుతమైన కానుకను ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఈ గిఫ్ట్‌ను దేవిశ్రీ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టగా వైరల్ అవుతుంది.

అయితే ఈ గిఫ్ట్ మాత్రం మ్యూజిక్ భాషలో ఉండడం గమనార్హం. '2022లో నేను అందుకున్న మరొక తీపి జ్ఞాపకం.. కమల్ హాసన్ సర్ నా కోసం అమెరికా నుంచి తెచ్చిన పుస్తకం.. అందులో మ్యూజిక్ కొటేషన్స్. కవర్ మీద ఆయన మాటలు, సంతకం చేసి ఇచ్చారు. ఇందులో 'నా బిడ్డ ఇది మీ అడ్డా' అని రాసిచ్చారు. అంటే దీని అర్థం 'దిస్ ఇస్ యువర్ అడ్డా' అని. ఈ విధంగా కమల్ హాసన్ గారు పుష్ప లైన్స్‌‌ను నాకోసం ఇలా వాడారు. నేనెంత అదృష్టవంతుడిని' అంటూ ఎమోషనల్ అయ్యాడు.

Advertisement

Next Story