మరో మూడేళ్లలో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన విజయ్

by sudharani |   ( Updated:2023-08-10 08:30:49.0  )
మరో మూడేళ్లలో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన విజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ, సమంత జంటగా వస్తున్న సినిమా ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పాటలు.. సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ క్రమంలోనే.. సినిమా ట్రైలర్ వేడుకను ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం. ఇక రిలీజ్ సమయం కూడా దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు మూవీ టీం. ఈ మేరకు మీడియా మిత్రులతో మాట్లాడుతూ.. తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విజయ్ దేవరకొండ.

మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని రిపోర్టర్ ప్రశ్నించగా దానికి విజయ్ స్పందిస్తూ.. ‘‘ఒకప్పుడు పెళ్లి గురించి మాట్లాడాలన్న కోపం వచ్చేది. కానీ ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇటీవల నా ఫ్రెండ్స్ చాలా మంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వారితో పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుందని కూడా డిస్కస్ చేస్తుంటాను. కొంత మంది లైఫ్‌లో జరిగే సంఘటనల ఆధారంగా పెళ్లి అంటే భయం పోయి.. నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. పెళ్లి అనేది అందమైన అనుభూతి. లైఫ్‌లో అందరూ ఆ అనుభూతిని ఆస్వాదించాలి. మూడేళ్లలో పెళ్లి చేసుకుంటాను. మిగిలిన విషయాలు అప్పుడే అందరికి చెబుతాను’’ అంటూ చెప్పుకొచ్చాడు.

నటుడు ప్రకాష్ రాజ్ కూర్చున్న కుర్చీలో మూత్రం పోసిన విద్యార్థులు.. అంత కోపం ఎందుకంటే..?

Advertisement

Next Story