Mahesh Babu సినిమా ఆడిషన్‌కు వెళ్లి చాలా ఏడ్చాను: Sameera Reddy

by Hamsa |   ( Updated:2023-02-04 03:50:22.0  )
Mahesh Babu సినిమా ఆడిషన్‌కు వెళ్లి చాలా ఏడ్చాను:  Sameera Reddy
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ సమీరారెడ్డి ఎన్‌టిఆర్ 'నరసింహుడు' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జై చిరంజీవ, అశోక్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 2014 లో అక్షయ్ వర్దేను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులతో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. తాజాగా, తన సినిమా కెరీర్‌ను గుర్తు చేసుకుంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. '' అది 1998 లో నేను మహేష్ బాబు సినిమా ఆడిషన్‌కు వెళ్లాను. ఆ రోజు చాలా భయమేసింది. దీంతో సరిగ్గా ఫెర్ఫార్మ్ చేయలేకపోయాను. ఇంటికి తిరిగి వెళ్తూ చాలాసేపు ఏడ్చేశాను. ఆ తర్వాత ఓ డెసిషన్ తీసుకున్నాను. రెండేళ్లపాడు పనిచేసిన వాచ్ కంపేనీలోనే ఉండిపోవాలని డిసైడ్ అయ్యాను. నా ముఖానికి డెస్క్ జాబే సరైనదని అనుకున్నా. కానీ, ఆ తర్వాత మళ్లీ ధైర్యం తెచ్చుకుని హిందీలో 'అహిస్తా కీజియా బాటియన్ మ్యూజిక్ వీడియో చేశాను'' అంటూ సమీర చెప్పుకొచ్చింది. దీంతో పాటు ఓ ఫొటోను కూడా షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి : విద్యారంగ విజయ గాథ సూపర్ 30

Advertisement

Next Story