ఎమోషనల్ బ్లాక్‌‌మెయిల్ తట్టుకోలేకనే అలా చేశానంటున్న హీరో విశాల్

by Prasanna |   ( Updated:2023-09-08 06:04:54.0  )
ఎమోషనల్ బ్లాక్‌‌మెయిల్ తట్టుకోలేకనే అలా చేశానంటున్న హీరో విశాల్
X

దిశ, సినిమా: తమిళ్ స్టార్ హీరో విశాల్‌కు టాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ ఉంది. తన ప్రతీ సినిమాను తెలుగులో విడుదల చేయడంతో మస్తు క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇక మరో మూవీ ‘మార్క్ ఆంటోని’తో సెప్టెంబర్ 15‌న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టైమ్ ట్రావెల్ కథగా తెరకెక్కిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అంచనాలను పెంచేసింది. ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా ప్రొడ్యూసర్స్ గురించి వైరల్ కామెంట్ చేశాడు విశాల్. అతను మాట్లాడుతూ.. ‘సినీ పరిశ్రమలో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా చాలా కాలం వెయిట్‌ చేసి ‘పందెంకోడి’ మూవీ చేశాను. అది పెద్ద హిట్ అయింది. తెలుగులోనూ సక్సెస్ సాధించింది. యాక్షన్ హీరోగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. కానీ అవి రిలీజ్ అయ్యే సమయానికి నిర్మాతలు నన్ను ఇబ్బంది పెట్టే వాళ్లు. శుక్రవారం రిలీజ్ అంటే.. గురువారం రాత్రి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేసేవాళ్లు. ఫైనాన్షియర్స్‌కి డబ్బులు ఇవ్వలేదని, సినిమా రిలీజ్ అవ్వదని నాతో డబ్బులు కట్టించేవారు. రెమ్యునరేషన్స్ కూడా సరిగ్గా ఇచ్చేవాళ్లు కాదు. ఇలాంటి ఇబ్బందులు చాలా చూశాను. అందుకే నావల్ల కాదనుకొని నేనే సొంత నిర్మాణ సంస్థ ‘విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ’ని ప్రారంభించి మంచి కథలతో వరుసగా సినిమాలు చేస్తూ నిలబడ్డాను’ అని చెప్పుకొచ్చాడు విశాల్.

Read More: అమెరికా నుంచి Samantha సడెన్‌గా హైదరాబాద్ కు వచ్చేసింది.. ఎందుకో తెలుసా..?

Advertisement

Next Story