పవన్ కల్యాణ్ అలాంటి వ్యక్తి అని తెలిసి ఆశ్చర్యపోయాను.. సలార్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-12-24 14:17:34.0  )
పవన్ కల్యాణ్ అలాంటి వ్యక్తి అని తెలిసి ఆశ్చర్యపోయాను.. సలార్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ నటి శ్రియా రెడ్డి పొగరు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. హీరో విశాల్ అన్నను పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ చిత్రంలో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ సోదరిగా రాధా రమ పాత్రలో శ్రియా రెడ్డి కనిపించారు. ఎక్కడ చూసినా శ్రియా రెడ్డి గురించే మాట్లాడుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను నెట్టింట వైరల్ చేస్తూ వస్తున్నారు. ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా కావడంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రియా రెడ్డి, పవన్ కల్యాణ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

OG కోసం సుజిత్ అదిరిపోయే కథని రాశారు. ఈ సినిమాలో నేను నటిస్తున్నందుకు ఎంతో ఆనందిస్తున్నా. ఈ మూవీలోని నా పాత్రలో చాలా షేడ్స్‌ ఉంటాయి, కానీ నెగెటివ్‌ రోల్‌ కాదు. పవన్ కల్యాణ్ అంత పెద్ద స్టార్ అని అనుకోలేదు. ఓజికి నేను ఎంపిక అయ్యేవరకు ఆయన పెద్ద స్టార్‌బయ్ ఉన్న వ్యక్తి అని నాకు తెలియదు. ఈ చిత్రంలో నేను నటిస్తున్నాను అని ఆడియన్స్ తెలిసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్లినా..మీరు మా దేవుడి సినిమాలో నటిస్తున్నారా? అని అడుగుతూ వస్తున్నారు. ఆయనకు ఉన్న విశేష ప్రజాధరణ చూసి ఆశ్చర్యం వేసింది. అలాంటి స్టార్‌తో కలిసి పని చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చాలా మంచి మనసు కలిగిన వారు. ఇతరులతో చాలా చక్కగా మాట్లాడతారు’’ అంటూ చెప్పుకొచ్చింది.

Read More..

సలార్‌లో శ్రుతి హాసన్‌ కంటే శ్రియా రెడ్డికే ఎక్కువ క్రేజ్..

Advertisement

Next Story