తేజగారి డైరెక్షన్‌లో లాంచ్ కావడం నా అదృష్టం: geethika tiwary

by samatah |   ( Updated:2023-05-24 13:30:39.0  )
తేజగారి డైరెక్షన్‌లో లాంచ్ కావడం నా అదృష్టం: geethika tiwary
X

దిశ, సినిమా: తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అహింస’. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి.కిరణ్ నిర్మించిన ఈ మూవీ జూన్ 2న విడుదలకానుంది. ఈ సందర్భంగా సినిమాలో హీరోయిన్‌గా నటించిన గీతికా తివారీ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకుంది. ‘మాది మధ్య ప్రదేశ్‌లోని జబల్పూర్. గ్రాడ్యుయేషన్ తర్వాత కెరీర్ మొదలు పెట్టాను. టాలీవుడ్ సినిమాలంటే చాలా ఇష్టం. కొత్తవారిని పరిచయం చేయడంలో తేజగారిది లక్కీ హ్యాండ్. ఆయన సినిమా ద్వారా లాంచ్ కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఆ పాత్ర ప్రయాణం నాకు చాలా నచ్చింది. ఛాలెజింగా అనిపించింది.ఈ సినిమా కుటుంబం, కల్చర్, నేచర్‌తో కనెక్ట్ అయింది. అహింస ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఫిల్మ్. ఇందులో మ్యూజిక్ వండర్ ఫుల్‌గా ఉంది. ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనుంది. ఒక్క జోనర్‌కు పరిమితం కాకుండా అన్నీ రకాల సినిమాలు, పాత్రలు చేయాలనుకుంటున్నా’ అని చెప్పింది.

Advertisement

Next Story