నన్నుపెళ్లి చేసుకునే వాడు అలాంటోడు అయ్యిండాలనుకుంటున్నా: Mrunal Thakur

by Hamsa |   ( Updated:2024-09-15 14:56:57.0  )
నన్నుపెళ్లి చేసుకునే వాడు అలాంటోడు అయ్యిండాలనుకుంటున్నా: Mrunal Thakur
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇందులో సాంప్రదాయ లుక్స్‌లో కనిపించి తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఆ తర్వాత మృణాల్, హాయ్ నాన్నతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇటీవల ఈ అమ్మడు నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ హిట్ అందుకోలేకపోయింది.

ప్రజెంట్ ఈ అమ్మడు బాలీవుడ్, టాలీవుడ్‌ ఇండస్ట్రీలో పలు చిత్రాలు చేస్తూ హీరోయిన్‌గా కొనసాగుతోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ తన పర్సనల్ లైఫ్ విషయానికి సంబంధించిన విషయాలు పంచుకుంది. ‘‘మన జీవితంలోకి వచ్చి వెళ్లే వారు చాలా మందే ఉంటారు. కానీ ఎవరు సూట్ అవుతారనేది అది మీకు తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అయితే నేను గతంలో ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నా.

కానీ అతను పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చా నటితో డేటింగ్ చేయడం ఇష్టం లేదని అన్నాడు. దీంతో ఇద్దరి ఇష్టంతో బ్రేకప్ చెప్పుకుని విడిపోయాం. ఆ తర్వాత మరో వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నా. కానీ వర్కౌట్ కాలేదు ఏడు నెలల క్రితం బ్రేకప్ అయింది. ఇప్పటి వరకు జీవితంలో జరిగిన బ్రేకప్స్ అన్ని బాధపడిపోయేంతలా ఏం కాలేదు. ఇద్దరి ఇష్టంతో విడిపోయాం కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకోవాలని అనుకోవట్లేదు. నేను అప్పుడే డిసైడ్ అయ్యాను. నన్ను చేసుకునేవాడికి అందమైన లుక్స్ లేకపోయినా కానీ మంచి మనిషి అయ్యిండాలి’’ అని చెప్పుకొచ్చింది.

Read More..

Samantha:హెల్తీ స్కిన్ కోసం సమంత సజెషన్.. పోస్ట్ వైరల్

Advertisement

Next Story

Most Viewed