ఆకలితో అలమటించా: హీరో నాని

by Aamani |
ఆకలితో అలమటించా: హీరో నాని
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరో నాని తన మొదటి అవకాశం కోసం ఏడాదిన్నర పాటు ఎదురుచూశానంటున్నాడు. ఇటీవల విడుదలైన ఆయన నటించిన ‘దసరా’ పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ఓ సమావేశంలో కెరీర్ అనుభవాలపై మాట్లాడిన నాని.. ‘బాపు దర్శకత్వంలో ‘రాధా గోపాళం’ చిత్రానికి క్లాప్ అసిస్టెంట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టా. అయితే ఆ చాన్స్ కోసం ఏడాదికి పైగా బాపు ఆఫీసు ముందు రోజు 9 గంటలకు వెళ్లి రాత్రి 7 దాకా వేయిట్ చేసేవాడిని. ఎందుకంటే ఎప్పుడూ దర్శకులకు కనిపిస్తుంటేనే మరిచిపోరని అనుకునేవాడిని. ఆ సమయంలో కొన్నేళ్లపాటు మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. చివరికి ‘వీడు వదిలేలా లేడు’ అనుకుని ‘రాధాగోపాళం’లో అవకాశం ఇచ్చాడు. బాపుగారి స్కూల్ నుంచి నా ప్రస్థానం మొదలైందని ఎప్పటికీ మరిచిపోను. అది నాకు దక్కిన గొప్ప అదృష్టం’ అంటూ గత రోజుల్ని గుర్తుచేసుకున్నాడు.

Advertisement

Next Story