నాని హీరోయిన్స్‌లో ముందుగా అదే చూస్తాడంట.. మామూలోడు కాదుగా..

by Anjali |   ( Updated:2023-06-18 16:17:05.0  )
నాని హీరోయిన్స్‌లో ముందుగా అదే చూస్తాడంట.. మామూలోడు కాదుగా..
X

దిశ, సినిమా: స్టార్ హీరోలు ఒక మూవీ ఓకే చేసినప్పుడు, తనతో నటించే హీరోయిన్ విషయంలో కూడా కేరింగ్‌గా ఉంటారు. అందం, నటన ఉన్నాయా లేదా క్రాస్ చెక్ చేస్తూ ఉంటారు. కాగా ఇందులో నేచురల్ స్టార్ నాని స్టైల్ మాత్రం వేరుగా ఉంటుందట. తన సినిమాల విషయంలో ఎంచుకునే కథనే కాదు.. తీసుకునే హీరోయిన్ల విషయంలో కూడా బాగా స్ట్రిక్ట్‌గా ఉంటారని తెలుస్తోంది. ముఖ్యంగా హీరోయిన్స్ కాల్ షీట్ విషయంలో నాని బాగా కఠినంగా వ్యవహరిస్తాడు. ఎందుకంటే హీరోయిన్లలో కొంతమంది సినిమాకు సైన్ చేసే ముందు ఒక లాగా, చేశాక మరోలా ఉంటారట. అందుకే తన సినిమాలో హీరోయిన్‌ను తీసుకునే ముందు అందం, నటనా పరంగా కాకుండా ట్రాక్ రికార్డు చెక్ చేస్తాడట. రెమ్యూనరేషన్, కాల్ షీట్స్ విషయంలో ఎలా ప్రవర్తిస్తుందో ముందుగా తెలుసుకున్న తర్వాత తన సినిమాలో ఫైనల్ చేస్తాడట.

ఇవి కూడా చదవండి:

‘ఆదిపురుష్’ను వదలని వివాదాలు .. రావణుడి గెటప్పై విమర్శలు

Advertisement

Next Story