MM Keeravani :: చావు భయంతో నిద్రలేని రాత్రులు.. నాకు 2 నెలలు పగలే-ఆసక్తికర పోస్ట్

by Hamsa |   ( Updated:2023-07-24 03:43:49.0  )
MM Keeravani :: చావు భయంతో నిద్రలేని రాత్రులు.. నాకు 2 నెలలు పగలే-ఆసక్తికర పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు 18 ఏళ్ల తర్వాత చంద్రముఖి-2 తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ వాసు ఇటీవల ప్రకటించాడు. రజినీకాంత్ ప్లేస్ లో రాఘవ లారెన్స్ నటిస్తుండగా.. ఈసారి చంద్రముఖిగా కంగనా రనౌత్ నటిస్తోంది. చంద్రముఖి- 2 తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

తాజాగా, చంద్రముఖి-2 సినిమా గురించి కీరవాణి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘ లైకా ప్రొడక్షన్స్ చంద్రముఖి 2 చూడడం జరిగింది. సినిమాలోని పాత్రలు మరణ భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతాయి. ఇక ఆ సన్నివేశాలకు నా మనసుకు హత్తుకునేలా సంగీతంతో జీవం పోయడానికి నాకు 2 నెలలు పట్టింది. నేను కూడా 2 నెలలు నిద్ర లేని పగలు, రాత్రులు గడిపాను. గురుకిరణ్ & నా స్నేహితుడు విద్యాసాగర్ దయచేసి నాకు శుభాకాంక్షలు తెలపండి’’ అంటూ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి :: ఆ హీరోతో నమిత ప్రేమాయణం.. డైరెక్టర్‌తో గొడవ అందుకేనా?

Advertisement

Next Story