రణవీర్ సింగ్‌కు ఫిమేల్‌ వెర్షన్‌ నేనే.. దీపికా పదుకొనేను మించిపోయానంటున్న ఫరియా అబ్దుల్లా

by samatah |   ( Updated:2023-08-08 07:21:59.0  )
రణవీర్ సింగ్‌కు ఫిమేల్‌ వెర్షన్‌ నేనే.. దీపికా పదుకొనేను మించిపోయానంటున్న ఫరియా అబ్దుల్లా
X

దిశ, సినిమా: ‘జాతిరత్నాలు’ మూవీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా ఓవర్ నైట్‌లో చిట్టి‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. మొదటి మూవీ‌తోనే తన స్మైల్, హైట్‌ తో నటన పరంగా, గ్లామర్ పరంగా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఫరియా అబ్దుల్లా‌కి వరుస ఆఫర్లు వస్తాయని అందరూ భావించారు. కానీ అలాంటిదేం జరగకపోగా తీసిన మూవీస్ కూడా హిట్ కాలేదు. దీంతో ప్రజెంట్ ఈ అమ్మడు వెబ్ సిరీస్‌లపై ఫోకస్ పెట్టింది. తన ఫస్ట్ వెబ్ సిరీస్‌గా ‘ది జెంగబూరు కర్స్’ రూపొందింది. ఈ నెల 9వ తేదీ నుంచి ఇది ‘సోనీ లైవ్’లో స్ట్రీమింగ్ కానుంది. సీరిస్ ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఒక ఇంటర్వూలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. తాను ఓ స్టార్ హీరోకు ఫిమేల్ వెర్షన్‌‌ అంటూ రణవీర్ సింగ్ గురించి ప్రస్తావించింది. అతనికి తను మాత్రమే పారలల్ యూనివర్స్ ఫిమేల్ వెర్షన్‌‌గా అనిపిస్తున్నానని, ఒక్కోసారి దీపికా పదుకొనే కంటే తానే ఎక్కువ రిలేట్ అవుతానని చెప్పుకొచ్చింది ఫరియా అబ్దుల్లా.

Read More: మళ్లీ తమిళ బాట పట్టిన రష్మిక.. ఏకంగా మల్టీస్టారర్ ఛాన్స్ కొట్టేసింది?

Advertisement

Next Story

Most Viewed