బ్యాడ్ కిస్సర్ రీమార్క్‌పై స్పందించిన జడ్.. ఆమె గ్రేట్ కిస్సర్ అంటూ

by Prasanna |   ( Updated:2023-08-08 11:56:42.0  )
బ్యాడ్ కిస్సర్ రీమార్క్‌పై స్పందించిన జడ్.. ఆమె గ్రేట్ కిస్సర్ అంటూ
X

దిశ, సినిమా : హిందీ ‘బిగ్ బాస్’ ఓటీటీ2లో వివాదాస్పదమైన తన ముద్దు వీడియోపై జడ్ హడిడ్ మరోసారి ఓపెన్ అయ్యాడు. ఈ మేరకు కో కంటెస్టెంట్ ఆకాంక్ష పూరితో క్లోజ్ రిలేషన్ మెయింటెన్ చేస్తూ షోలో తెగ హల్ చల్ చేసిన ఆయన.. ఓ టాస్క్‌లో భాగంగా ఆకాంక్షకు డీప్ కిస్ ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అలాగే జడ్‌ను బ్యాడ్ కిస్సర్‌గా పేర్కొంటూ ఆకాంక్ష అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. కాగా షో నుంచి మధ్యలోనే ఎలిమినేట్ అయిన జడ్ రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆమె మా టాస్క్‌ను ‘బ్యాడ్ కిస్’గా పేర్కొనడాన్ని నేను తప్పుగా భావించలేదు. నిజానికి నేనే ఆకాంక్షకు క్షమాపణలు చెప్పాల్సింది. ఆమె ఒక గ్రేట్ కిస్సర్ మాత్రమే కాదు గ్రేట్ పర్సన్ కూడా. ఆమె దయగల మహిళ. ఆమెతో బిగ్ బాస్ ప్రయాణం కొత్త అనుభూతినిచ్చింది. అందరితోనూ సులభంగా కలిసిపోతుంది. ఎప్పటికీ ఆమెతో ఫ్రెండ్‌షిప్ కొనసాగించాలని కోరుకుంటున్నా’ అంటూ ఆకాంక్ష క్యారెక్టర్‌పై ప్రశంసలు కురిపించాడు.


Read More: అంజలి సైజులపై దారుణమైన కామెంట్స్.. దిగజారిపోవద్దంటు నటి ఫైర్

Advertisement

Next Story