- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ మూవీ కోసం 31 కిలోలు తగ్గాను : పృథ్వీరాజ్ సుకుమారన్
దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆడుజీవితం’. నిజ జీవిత ఘటన ఆధారంగా రూపొందిన ఈ మూవీ మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి 2008లోనే అనుకున్న ఈ మూవీలో ముందు సూర్య, విక్రమ్ లాంటి తమిళ హీరోలను సంప్రదించారు. వాళ్లు నిరాకరించడంతో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ దగ్గరికి వెళ్లారు. ఆ తర్వాత కూడా సినిమాకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రీ ప్రొడక్షన్ ఎన్నో అడ్డంకులు మధ్య సాగి చివరికి 2018 లో సినిమా షూటింగ్ మొదలైంది.
అలా మొత్తానికి ఈ మూవీ షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్ ఈ మూవీ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.. ‘ఈ మూవీ నా కెరీర్‌కి ఇక సవాల్ లాంటిది. ఇందులో నేను నజీబ్ అనే బానిస పాత్ర పోషించాను. దానికోసం 31 కిలోల బరువు తగ్గాను. జిమ్ ట్రైనర్, పోషకాహార నిపుణులు, డాక్టర్స్ పర్యవేక్షణలో ఇది సాధ్యమైంది. వారు నన్ను విశ్రాంతి తీసుకోమని సూచించేవారు. కానీ కొన్ని సందర్భాల్లో 72 గంటలు షూటింగ్ లో ఉండాల్సి వచ్చేది. ఇక కరోనా లాక్ డౌన్ ల్లో చిత్రబృందం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. పశ్చిమాసియాలోని జోర్డాన్ ప్రాతంలో షూటింగ్ చేస్తున్నప్పుడు లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో ఆ మూడు నెలలు జోర్డాన్ రాయల్ ఫిల్మ్ కమిషన్ మమ్మల్ని ఆదరించింది. ఈ సినిమా కోసం మేమందరం చాలా కష్టపడ్డాం. ఈ విషయాలను తెలియజేయడానికి ఇదే సరైన సమయం అనిపించి. అందుకే చెప్పాను’ అని పృద్వీరాజ్ వెల్లడించాడు.
Read More..