- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Vikram: తెలుగు ఆడియెన్స్ గురించి నాకు తెలుసు.. తంగలాన్ సక్సెస్ మీట్‌లో విక్రం
దిశ, సినిమా: చియాన్ విక్రమ్ హీరోగా నటించిన తాజా సినిమా ‘తంగలాన్’. పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహించాడు. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించి మెప్పించారు. రిలీజ్‌కు ముందుకు ఈ మూవీ నుంచి విడుదలైన ప్రతి అప్‌డేట్ ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్‌లో హై ఎక్స్‌పెక్టేషన్స్ నింపేశాయి. ఈ క్రమంలోనే భారీ అంచనాల మధ్య ‘తంగలాన్’ ఈ నెల 15న థియేటర్స్‌లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం.
ఈ సందర్భంగా చియాన్ విక్రమ్ మాట్లాడుతూ.. ‘ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్, రైటర్స్ రాకేందు మౌళి, భాస్కరభట్ల.. మీరంతా మీ సొంత సినిమా గురించి మాట్లాడినంత ప్రేమగా "తంగలాన్" గురించి మాట్లాడారు. మీరు సినిమాను అంతగా ప్రేమించారు కాబట్టే అలా హార్ట్ ఫుల్‌గా మాట్లాడగలిగారు. నా పాత్రకు డబ్బింగ్ చెప్పిన ఆర్సీఎం రాజు థ్యాంక్స్. సినిమాకు మీరు ఇస్తున్న రెస్పాన్స్ వీడియోలు చూస్తున్నప్పుడు మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తున్నాయి. అంత సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఇలాంటి కంటెంట్ డ్రివెన్ మూవీస్‌ను తెలుగు ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు. నేను శివపుత్రుడు చేసినప్పుడు ఈ సినిమా తెలుగులో ఆదరణ పొందుతుందా అని సందేహం వచ్చింది. కానీ తెలుగులో శివపుత్రుడు ఘన విజయాన్ని అందుకుంది. నేను చెప్పినట్లే "తంగలాన్"కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్రాంతంలో ప్రేక్షకులు ఎంతో ప్రేమను చూపిస్తున్నారు. నాతో ఇలాంటి స్పెషల్ మూవీ చేసినందుకు దర్శకుడు పా రంజిత్‌కు థ్యాంక్స్ చెబుతున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.