Sushant Singh Rajput తో నాకు అలాంటి అనుబంధం ఉంది: Naveen Polishetty Emotional

by sudharani |   ( Updated:2023-09-05 14:43:26.0  )
Sushant Singh Rajput తో నాకు అలాంటి అనుబంధం ఉంది: Naveen Polishetty Emotional
X

దిశ, సినిమా: అనుష్క శెట్టి, న‌వీన్ పోలిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 7న తెలుగు, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ కానుంది. అయితే ప్రమోషన్‌లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన నవీన్ పోలిశెట్టి.. ‘‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్‌కు వచ్చిన స్పందనతో మాకు ఈ సినిమాపై పూర్తి నమ్మకం కలిగింది. అందుకే మూవీని ప్రేక్షకులకు మరింత దగ్గరగా తీసుకెళ్లాలని స్టాండప్ టూర్ ప్లాన్ చేశాం. ఏపీ, తెలంగాణలో చాలా ప్రాంతాలు తిరిగాం. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి, కరీంనగర్, వరంగల్‌లో విశేషమైన ఆదరణ లభించింది. మొత్తానికి ఈ చిత్రం కృష్ణాష్టమి రోజు విడుదల అవుతుంది. కృష్ణుడి అల్లరి ఎలా ఉంటుందో ఈ సినిమాలో కూడా అంతే అల్లరి ఉంటుంది.

ఇక సాధారణంగా టాలీవుడ్‌లో సినిమాలు చేసి బాలీవుడ్‌కు వెళ్తుంటారు. కానీ నేను రివర్స్ చేశాను. హిందీలో చేసిన ‘చిచ్చోరే’ సినిమా ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌‌తో నాకు మంచి అనుభందం ఉంది. అతను మన మధ్య లేడు అంటే ఇప్పటికి నమ్మలేను. నేను, సుశాంత్, నితీన్ తివారీ ముగ్గురం ఇంజనీరింగ్ స్టూడెంట్స్. నితిన్ ఐఐటీ బాంబేలో చదువుకున్నారు. ఇక మేము ముగ్గురం ‘చిచ్చోరే’ సినిమా షూటింగ్ చేసేటప్పడు సుశాంత్ షూటింగ్‌కు వచ్చే ప్రతిరోజు కొన్ని పజిల్స్ తెచ్చేవాడు. వాటిని మేము ముగ్గురం కలిసి సాల్వ్ చేసేవాళ్లం. ఆ రోజులు నేను ఎప్పటికి మర్చిపోలేను’ అంటూ ఎమోషనల్ అయ్యాడు నవీన్ పొలిశెట్టి.

ఇవి కూడా చదవండి : Chiranjeevi , Pawan Kalyan కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన Naveen Polishetty

Advertisement

Next Story