- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అప్పుడే ఆస్తులన్నీ అమ్మేశాను నా ఆరోగ్యంపై పుకార్లు సృష్టించొద్దు.. కమెడియన్ సుధాకర్ కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ కమెడియన్ సుధాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వందల సినిమాలు చేసి మెప్పించారు సుధాకర్. అయితే ఇటీవల ఆయన అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. కోమాలోకి కూడా వెళ్లారు. అయితే ఇటీవల ఆయన చనిపోయారంటూ పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన బాగానే ఉన్నట్టు ఓ వీడియో ద్వారా అధికారికంగా తెలిపారు.
తాజాగా, చాలా రోజులకు మీడియా ముందుకి వచ్చి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమెడియన్ సుధాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఇప్పటికీ చిరంజీవి, జగపతి బాబు, తనికెళ్ల భరణి, జేడీ చక్రవర్తికి ఫోన్ చేసి మాట్లాడతాను. చైన్నైలో నాకు చాలా ఆస్తులు ఉన్నాయి. కానీ, తమిళ్‌లో సినిమాలు చేస్తున్న సమయంలో తెలుగులో కమెడియన్‌గా బ్రేక్ రావడంతో అక్కడికి వెళ్లి సెటిల్ అయ్యాను. ఆ తర్వాత చెన్నైలో ఉన్న ఆస్తులన్నీ అమ్మేశాను అంటూ చెప్పుకొచ్చారు. అలాగే తన ఆరోగ్యం గురించి స్పందిస్తూ.. ఇలాంటివి గతంలో కూడా చాలా చూశాను. సెలబ్రిటీలపై ఇలాంటి పుకార్లు సహజమే. ప్రస్తుతానికి నా ఆరోగ్యం బాగుంది. దయచేసి ఎలాంటి పుకార్లు సృష్టించకండి. నా కొడుకు బెన్నీ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడు. యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే ఇండస్ట్రీకి పరిచయం అవుతాడు’’ అని కమెడియన్ సుధాకర్ తెలిపారు.
Also Read: చిరంజీవితో నటిస్తానంటున్న లావణ్య త్రిపాఠి.. ఫైర్ అవుతున్న నెటిజన్స్..