ఆ విషయంలో ఒత్తిడికి గురవుతున్న.. రాజమౌళి పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆలియా భట్‌

by Kavitha |   ( Updated:2024-03-18 10:10:05.0  )
ఆ విషయంలో ఒత్తిడికి గురవుతున్న.. రాజమౌళి పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆలియా భట్‌
X

దిశ, సినిమా: వారసత్వంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అనతి కాలంలోనే తన అందం నటనతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాధించుకుంది ఆలియాభట్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కీలక పాత్రలో ‘జిగ్రా’ అనే మూవీలో నటిస్తోంది. వాసన్‌ బాలా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని తన ప్రొడక్షన్స్‌పై కరణ్‌ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.. సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే ‘RRR’ మూవీలో నటించి మెప్పించారు ఆలియా.. తాజాగా ఓ వేదికపై మాట్లాడుతూ రాజమౌళి గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.. ‘సినిమాల ఎంపిక విషయంలో నేను మొదటి నుంచి ఒత్తిడికి గురవుతున్నాను. అదే విషయాన్ని ఓసారి రాజమౌళికి చెప్పాను. అప్పుడు ఆయన నాతో ఒక్కటే మాట చెప్పారు ‘ఏది ఎంచుకున్నా ప్రేమతో చేయండి. అప్పుడు సినిమా ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులు మీ నటనను ప్రశంసిస్తారు. మీకు కనెక్ట్‌ అవుతారు. ఈ ప్రపంచంలో ప్రేమతో చేసే పనికి మించిన గొప్పది ఏది లేదు’ అని చెప్పారు. అప్పటి నుంచి అదే పాటిస్తున్నా. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నా వద్దకు వచ్చిన ప్రతి కథకు ఓకే చెప్పేదాన్ని. నిజం చెప్పాలంటే నాకు సహనం తక్కువ. ఇప్పుడు ఆ పద్ధతి మారింది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఎంత కష్టమైన పాత్రనైనా అంగీకరించాలని నిర్ణయించుకున్నా’ అని అలియా అన్నారు.

Read More..

కారు ఢీకొని స్టార్ హీరోయిన్‌కు తీవ్రగాయాలు.. ఐసీయూలో చికిత్స పొందుతూ సాయం కోరుతున్న నటి!

Advertisement

Next Story