- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేను మంచి సినిమాలే చేశా, కానీ మెగాస్టార్ కాలేదు.. బాలకృష్ణ కూడా అంతే.. శివాజీ సంచలన కామెంట్స్!
దిశ, సినిమా: హీరో శివాజీ అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు హీరోగా ఆయన కామెడీ, ఫ్యామిలీ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఇతనికి క్రమంగా పరాజయాలు, రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమా కెరీర్‌కి బ్రేక్ వచ్చింది. ఇటీవల `బిగ్ బాస్`లోకి వెళ్లాక ఆయన చేసే ప్రతి కామెంట్ హైలైట్‌గా, వైరల్‌గా మారి ఆయనకు క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ అనంతరం బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మధ్య 90 మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్‌లో నటించిన శివాజీ ఇప్పుడు సినిమాల్లోనూ రీఎంట్రీ ఇస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇటీవల సినిమా రంగంపై ఆయన చేసిన కామెంట్లు హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా తాజాగా మెగాస్టార్‌తో పోల్చుతూ బాలకృష్ణ గురించి ఓపెన్ అయ్యాడు శివాజీ. తాను మంచి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో చాలా కాలం ఉన్నాను. అలాగే చాలా హిట్స్ కూడా అందించాను. కానీ నేను మెగాస్టార్‌ని ఎందుకు కాలేకపోయాను, నేనే కాదు, చాలా మంది హీరోలు ఉన్నారు కానీ వాళ్లెవరూ మెగాస్టార్ కాలేదు. చిరంజీవి మాత్రమే ఆ స్థాయికి వెళ్లారు. మరి మేమంతా ఎందుకు కాలేదు అని ప్రశ్నించాడు శివాజీ.
అలాగే బాలకృష్ణ నాయకత్వ లక్షణాలు, సీఎం పదవికి కూడా అంతే అని, అది కొందరికే సాధ్యమని, అందరూ కాలేరని తెలిపారు. బాలకృష్ణ విషయంలోనూ అంతే అని, ఆయన కాలేదంటే దానికి సమాధానం లేదని, తానేం చెప్పలేనని తెలిపారు. కాలమే అన్నీ నిర్ణయిస్తుందని, టాలెంట్ ఉంటే ఎవరిని ఎవరూ ఆపలేరు ఎలాగైనా వస్తారని తెలిపారు. మెగాస్టార్‌ని దాటి ప్రభాస్ వచ్చినట్టు రాజకీయాల్లోనూ అది జరుగుతుందని, రేప్పొద్దున్న ఎన్టీఆర్ రాజకీయాలకు రావచ్చు అన్నారు. ఇప్పుడు వద్దు అని ఆయన భావించి రాజకీయాలకు దూరంగా ఉండొచ్చు, లేదంటే చంద్రబాబుతో, బాలయ్యతో గొడవలు ఉండవచ్చు, అవన్నీ ఫ్యామిలీ మ్యాటర్స్, ఫ్యామిలీ అన్నాక సవాలక్ష గొడవలు, మనస్పర్థలు ఉంటాయని తెలిపారు శివాజీ. ఈ క్రమంలో చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు కానీ బాలయ్య సీఎం కాలేదంటే ఆయనకు ఆ స్థాయి లేదా అనే అర్థంలో శివాజీ మాట్లాడటం గమనార్హం. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట హాట్ టాాపిక్‌గా అయినాయి.