రెండేళ్లుగా నేను అదే పరిస్థితి ఎదుర్కొంటున్నాను: సమంత

by Vinod kumar |   ( Updated:2023-03-29 11:21:34.0  )
రెండేళ్లుగా నేను అదే పరిస్థితి ఎదుర్కొంటున్నాను: సమంత
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. ఈ సినిమా వచ్చే నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్‌లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా సమంత కూడా చాలా ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ.. ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటుంది. అలాగే తన లైఫ్‌లో జరిగిన కొన్ని చేదు అనుభవాల గురించి కూడా వెల్లడిస్తుంది.

‘గత రెండున్నరేళ్లుగా నా జీవితంలో చాలా జరుగుతున్నాయి. నన్ను నిలబెట్టింది నా ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే. ఇప్పటికీ నిలకడగా ఉండే శక్తిని అందించింది. నాకు ఎలాంటి సమస్య వచ్చినా.. దాని ప్రభావం నా పని మీద పడనివ్వను. నేను మంచం మీద నుంచి లేవలేకపోతే తప్ప. గత కొన్ని నెలలుగా అదే పరిస్థితిలో ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది సామ్.

Read more:

ఆహా ఎంత అందంగా ఉంది గురూ.. అమ్మాయి అయితేనా..?

Advertisement

Next Story