- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుడే మొదటిసారి అతనితో ప్రేమలో పడ్డాను..
దిశ,సినిమా:పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ అందరికీ సుపరిచితమే. ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ సరసన బద్రి మూవీలో నటించిన రేణుదేశాయ్ ఈ సినిమా తర్వాత ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడిపోయారు కూడా. వీరికి అకీరా నందన్, ఆద్య పిల్లలు ఉన్నారని అందరికి తెలిసిన విషయమే.
అయితే తాజాగా రేణూ దేశాయ్ స్వయంగా తమ ప్రేమకథ ఎలా మొదలైందో పంచుకున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పవన్‌కల్యాణ్‌తో తన ప్రేమబంధం ఎక్కడ, ఎలా ప్రారంభమైంది? అనే విషయాలను పంచుకుంది. 'బద్రి' సినిమా ఆడిషన్స్ సమయంలో ఆమె మొదటిసారి పవన్‌కల్యాణ్‌ని కలిసిందట.అప్పుడే 'తమ్ముడు' సినిమా షూటింగ్ రామానాయుడు స్టూడియోలో జరుగుతుండటంతో అక్కడే ఆడిషన్స్ జరిగాయి. అక్కడ ఉన్న జనం హడావుడి చేస్తుంటే, హీరో వస్తున్నాడని అనుకుందట రేణు. అప్పటికే పవన్ స్టార్ హీరో. అంతేకాకుండా మెగాస్టార్ తమ్ముడు కానీ ఆ ఆర్భాటం లేకుండా సింపుల్‌గా డైరెక్టర్ వెనకాలే నడిచి వస్తున్న పవన్‌ని చూసి షాక్ అయిందట. నిజానికి పవన్ కి అంతా అనుకున్నట్టుగా కోపం లేదని ఆయన చాలా కామ్ గా ఉంటాడనీ,తక్కువ మాట్లాడతాడనీ చెప్పింది. అప్పుడే అంత సింపుల్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ను చూసి ఇక, ఆ క్షణమే ఆయనపై ఎనలేని అభిమానం ఏర్పడిందనీ, తర్వాత అది ప్రేమగా మారిందనీ అన్నది.