- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
మా నాన్న కోరికని అలా నెరవేర్చా : Urvashi Rautela
దిశ, సినిమా: ఇటివల కాలంలో థ్రిల్లింగ్ అండ్ హారర్ స్టోరీస్.. వాస్తవ సంఘటనల ఆధారంగా వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి సినిమాలు సామాన్య ప్రజలను కూడా ఏదో విధంగా ఆలోచింపజేస్తున్నాయి. సమాజంలో ఏం జరుగుతున్నాయే తెలుకొగలుగుతున్నారు. అదే తరహాలో ఇటీవల విడుదలైన ‘ఆర్టికల్ 370’ మంచి వసూళ్లను సొంతం చేసుకుంటోంది.
ఇక ఇదే జాబితాలో నయ్ శర్మ దర్శకత్వంలో ‘జేఎన్‌యూ: జహంగీర్ నేషనల్ యూనివర్సిటీ’ అనే మూవీ తెరకెక్కతుంది. ఇందులో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కీలక పాత్ర పోషించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...‘ఢిల్లీలో ఓ యూనివర్సిటీ లో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం రానుంది. నేనీ సినిమాలో జేఎన్‌యూ విద్యార్థినిగా కనిపిస్తా. విద్యార్థిగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటూ, కాలేజీ రాజకీయాల్లో చేరిపోయే పాత్ర అది. విద్యాసంస్థల పేరుతో దేశ సమైక్యతకు ప్రమాదం కలిగించేందుకు కొన్ని వర్గాలు చేస్తున్న తప్పుల గురించి ఈ మూవీలో చూపించారు. నా స్కూల్ సమయం నుంచి నేను ఆ యూనివర్సిటీలో చదవాలనేది మా నాన్న కోరిక. నిజ జీవితంలో అలా జరగకపోయినా తెరపై నటిస్తూ ఆయన కోరిక ఇలా నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని తెలిపింది ఊర్వశి. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు వైరల్ అవుతున్నాయి.