నాగచైతన్యను పెళ్లి చేసుకోవడానికే ఇండస్ట్రీకి వచ్చా.. రీతూ చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-09-23 05:18:38.0  )
నాగచైతన్యను పెళ్లి చేసుకోవడానికే ఇండస్ట్రీకి వచ్చా.. రీతూ చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర నటి రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామర్ ఫొటోలతో ఊహించని స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంది.

తాజాగా, అలీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అలీ ఆల్ ఇన్ వన్’ షోలో రీతూ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో యాంకర్ అలీ ఏ ఊరు మీది అని రీతూ చౌదరిని అడుగ్గా.. నాది ఆంధ్రా, తెలంగాణ బోర్డర్ అని ఆమె సమాధానం ఇచ్చింది. అలాగే తాను అక్కడా, ఇక్కడా ఉంటానని చెప్పుకొచ్చింది. ఒక గేమ్ లో భాగంగా అల్లు అర్జున్ ఫోటోను రీతూ చౌదరి కరెక్ట్ ప్లేస్ లో పెట్టగా అలీ ఆమెను అల్లు అర్జున్ ఫ్యానా అని అడిగాడు. రీతూ చౌదరి వెంటనే నాగచైతన్యను పెళ్లి చేసుకుందామని ఇండస్ట్రీకి వచ్చానని తెలిపింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఫుల్ ఎపిసోడ్ లో రీతూ చౌదరి ఏం చెప్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story