అందులో నేను చాలా షార్ప్.. నాతో ఎవరూ పోటీ పడలేరు : Janhvi Kapoor

by samatah |   ( Updated:2023-07-22 06:40:53.0  )
అందులో నేను చాలా షార్ప్.. నాతో ఎవరూ పోటీ పడలేరు : Janhvi Kapoor
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ‌ కపూర్ నటించిన తాజా చిత్రం ‘బవాల్‌’ రీసెంట్‌గా ఓటీటీలో విడుదలైంది. చరిత్ర, వర్తమాన అంశాల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు నితీష్‌ తివారి. కాగా రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వి.. తనకు హిస్టరీ సబ్జెక్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని తెలిపింది. ‘స్కూల్ డేస్ నుంచి కూడా నాకు హిస్టరీ అంటే చాలా ఇష్టం. చరిత్రకు సంబంధించిన వ్యాసరచన పోటీల్లో కూడా బహుమతులు నాకే లభించేవి. మిగిలిన సబ్జెక్ట్స్‌లో నార్మల్ స్టూడెంట్‌నే.. కానీ హిస్టరీలో మాత్రం నాతో ఎవరూ పోటీపడలేరు. ప్రపంచ చరిత్రపై నాకు పూర్తి అవగాహన ఉంది. నా సినీ కెరీర్‌లో హిస్టారికల్ స్టోరీస్‌లో నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోవద్దు అనుకున్న.. అందుకే ‘బవాల్‌’ మూవీలో నటించాను. ఇందులో రెండవ ప్రపంచ యుద్ధ ప్రస్తావన ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది జాన్వి.

Read More: అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న సమంత

Advertisement

Next Story