Natural Star Nani: మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్న: నేచురల్ స్టార్ నాని

by sudharani |
Natural Star Nani: మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్న: నేచురల్ స్టార్ నాని
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో SJ సూర్య పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు. ఆగస్టు 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకుంది. అలాగే ప్రమోషనల్ కంటెంట్ ‘సరిపోదా శనివారం’పై హ్యుజ్ బజ్ క్రియేట్ చెయ్యగా.. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు చిత్ర బృందం.

ఈ సంర్భంగా నాని మూవీపై ఆసక్తిక కామెంట్స్ చేశాడు. ‘అందరికీ నమస్కారం.. మనం మధ్యలో ఒక ప్రామిస్, ఒక బాండ్ వుంది. ఈ బాండ్‌ని ఇంకా ఇంకా బలపరిచే సినిమా 'సరిపోదా శనివారం' అవుతుంది. ఈసారి సినిమా హాళ్ళు కాన్సర్ట్ లా వుంటుంది. జేక్స్ బిజోయ్ చితకొట్టేస్తున్నాడు. ఎప్పుడెప్పు మీరు చూస్తారా అని ఎదురుచూస్తున్నాను. మీతో పాటు చూడటానికి ఎదురుచూస్తున్నాను. మూవీ టీమ్ అందరికీ పేరుపేరునా థాంక్స్. సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. వివేక్ రెండు నెలలుగా నిద్రపోయింది లేదు. ఆ కష్టం తెరపై కనిపిస్తుంది. వాళ్ళందరి కోసం ఈసారి సినిమా వేరే లెవల్‌కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రీరిలీజ్ ఈవెంట్ 24న జరగబోతోంది. టీం అందరితో కలసి ఆ రోజు సెలబ్రేట్ చేసుకుందాం. ఆగస్ట్ 29న థియేటర్స్‌లో కలుద్దాం. నాకు కోపం వచ్చింది, నాకు కోపం వచ్చిందంటే బ్లాక్ బస్టర్ కన్ ఫర్మ్ అవ్వాల్సిందే' అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story