Ashwin Babu: హిప్నటైజ్ చేస్తున్న శివం భజే మూవీ ‘రం రం ఈశ్వరం’ సాంగ్ (వీడియో)

by Hamsa |
Ashwin Babu: హిప్నటైజ్ చేస్తున్న శివం భజే మూవీ ‘రం రం ఈశ్వరం’ సాంగ్ (వీడియో)
X

దిశ, సినిమా: హీరో అశ్విన్ బాబు, దర్శకుడు అప్సర్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'శివం భజే'. ఇందులో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఆగస్ట్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో.. ప్రమోషన్స్‌లో ఫుల్ అయిపోయిన చిత్రబృందం. ఇందులో భాగంగా శివం భజే మూవీ నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా, హిప్నటైజ్ చేస్తున్న గంగా ఎంటర్టైన్మంట్స్ ‘శివం భజే’ మొదటి పాట 'రం రం ఈశ్వరం’ పాటను విడుదల చేశారు. ‘రం రం ఈశ్వరం’ అని మొదలయ్యే ఈ శివస్తుతి పాట లిరికల్ వీడియోని సెన్సేషనల్ మ్యూజిక్ డైరక్టర్ తమన్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. "రం రం ఈశ్వరం.. హం పరమేశ్వరం.. యం యం కింకరంవం గంగాధరం" అంటూ సాగే శివ స్తుతికి తగ్గట్టుగా హిప్నోటైజ్ చేసేలా మ్యూజిక్ సెట్ అవ్వడంతో ఈ పాట విడుదలైన కొంత సేపటికే అన్ని చోట్ల నుండి అద్భుతమైన స్పందన లభించింది.

వికాస్ బడిస ట్యూన్ చేసిన ఈ పాటకి రచయిత పూర్ణాచారి సాహిత్యం అందించగా, సాయి చరణ్ పాడారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు ఆఖరి దశలో ఉన్న మా 'శివం భజే' చిత్రం ఆగస్టు 1న బ్రహ్మాండమైన విడుదలకి సిద్ధమవుతుంది. తాజాగా, ప్రమోషన్స్ లో భాగంగా మొదటి పాట ''రం రం ఈశ్వరం" ని శివ స్తుతితో సాగే ఈ పాట విడుదలైన కొంతసేపటికే అన్ని వైపుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. పాట వింటూ ఉంటే తెలీకుండా శివ ధ్యానంలోకి వెళుతున్నట్టుగా తన్మయత్వంతో వింటున్నామని కొందరు చెప్పడం చాలా సంతోషంగా అనిపించించింది. మా మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిస నేపథ్య గీతం, పాటలు ఈ చిత్రానికి చాలా బలమవుతాయి అని అన్నారు.


Advertisement

Next Story

Most Viewed