అమ్మాయిల కొలతలపై హైపర్ ఆది తిక్క వాగుడు.. వెర్రి వెకిలి చేష్టలు..

by Dishafeatures3 |
అమ్మాయిల కొలతలపై హైపర్ ఆది తిక్క వాగుడు.. వెర్రి వెకిలి చేష్టలు..
X

దిశ, సినిమా : హైపర్ ఆది స్కిట్ అంటే కామెడీ కన్ఫర్మ్ కానీ ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేంత హెల్తీగా మాత్రం ఉండదు అనేది తెలిసిన విషయమే. కాగా తన స్టైల్ ఆఫ్ సెటైర్స్ వేస్తూ పిచ్చి మాటలు వెకిలి చేష్టలతో మొత్తానికి స్కిట్ అయితే పూర్తి చేస్తాడు. కాగా ఇలాంటి ఓ స్కిట్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. తిట్టిపోస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్.

ఇక ఇందులో టైలర్‌గా కనిపించాడు ఆది. ఈ క్రమంలో అమ్మాయిల కొలతలపై కుళ్లు జోకులు వేశాడు, తోటి ఆర్టిస్టులతో వేయించాడు. ‘ముందు కిటికీలు వెనుక తలుపులు’, ‘నడుము 110 ఉందా.. కాదు 130’, ‘ నా కొలతలు నువ్వే తీసుకో’ , ‘గుండీలు నోటితేనే కుడుతున్నారుగా జిప్ కూడా ఊడిపోయింది మరి’, ‘నీ భార్య జాకెట్ కుట్టాలని వచ్చావ్.. నువ్వే చింపావా?’ ‘అసలు చీరే కట్టుకోవద్దని చెప్పు’, ‘ లంగా.. నా లోపలి లంగ కుడుతావా?’, ‘ఇచింగ్.. స్టిచింగ్’ లాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో చిర్రెత్తించాడు. ఇక ఈ వీడియోపై స్పందిస్తున్న జనాలు.. హైపర్ ఆది స్కిట్ అంటేనే అన్‌హెల్తీ కామెడీ అని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed