త్రివిధ దళాల్లో జాయింట్ కల్చర్ గురించి సీడీఎస్ ఏమన్నారంటే?

by Shamantha N |   ( Updated:2024-05-22 10:31:30.0  )
త్రివిధ దళాల్లో జాయింట్ కల్చర్ గురించి సీడీఎస్ ఏమన్నారంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: త్రివిధ దళాల్లో ఉమ్మడి కార్యాచరణ రూపొందించే దిశగా జాయింట్ కల్చర్ సృష్టించాలని పిలుపునిచ్చారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్. మేజర్ జనరల్ సమీర్ సిన్హా 22వ మెమోరియల్ లెక్చర్ లో ఆయన ప్రసంగించారు. ‘జాయింట్‌మ్యాన్‌షిప్: ది వే ఎహెడ్’పై మాట్లాడారు. సాయుధ దళాల్లో ఉమ్మడి సంస్కృతిని అభివృద్ధి చేయడాన్ని “జాయింట్‌నెస్ 2.0” ని తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన చేసిందన్నారు. జాయింట్‌నెస్ 1.0 అనేది త్రివిధ దళాల మధ్య సేవలకు సంబంధించినది అన్నారు. జాయింట్ నెస్ 2.0 అనేది త్రివిధ దళాలను మరోమెట్టు ఎక్కించేందుకు ఉపయోగపడుతుందన్నారు.

భారత రక్షణ వ్యవస్థలో సంస్కరణలు అవసరమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు తమ భద్రతా వ్యూహాలను సమీక్షించాల్సి వస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్ లో జరిగే యుద్ధాల గతిని సాంకేతికత మార్చివేస్తుందన్నారు.

Read More..

కోల్‌కతాలో బంగ్లాదేశ్ ఎంపీ అదృశ్యం: విచారణ చేపట్టిన పోలీసులు

Advertisement

Next Story