- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పదేళ్లు ప్రధానిగా ఒక్కరే.. మోడీ వ్యాఖ్యలపై ఖర్గే కౌంటర్
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మండిపడ్డారు. ఒకవేళ ఇండియా కూటమి పవర్ లోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు ఉంటారని మోడీ విమర్శలు గుప్పించారు. హర్యానాలో లోక్ సభ ఎన్నికల ప్రచారం చేపట్టిని ఖర్గే.. మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 2004కు ముందు కూడాఇలానే మాట్లాడారని గుర్తుచేశారు. పదేళ్ల యూపీఏ పాలనలో మన్మోహన్ సింగ్ ఒక్కరే ప్రధానిగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయన ప్రధానిగా రెండు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
యూపీఏ 1, 2 హయాంలో ఇతర పార్టీలన్నీ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాయని తెలిపారు. పదేళ్లపాలనలో రెండు సార్లు ప్రధానిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు చేపట్టారని తెలిపారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన సామర్థ్యంతో దేశ ఆర్థిక స్థితిని మార్చివేశారన్నారు. పదేళ్ల పాలనలో బీజేపీ ఏమీ చేయలేదని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత కూటమి నేతలంతా సమావేశమై ప్రధాని ఎవరనే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 2004లోనూ బీజేపీ ఇలాంటి విమర్శలే చేసిందన్నారు. అయితే, అప్పుడు యూపీఏ ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపిచామో.. ఇప్పుడూ అదే కొనసాగిస్తామన్నారు. మోడీ ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి అడ్డుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.
Read More..
మోడీని ఉద్దేశించే మాట్లాడారా?.. అమిత్ షా పదవీ విరమణ వ్యాఖ్యలపై చిదంబరం కామెంట్స్