BREAKING: ఈవీఎంలు ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి.. సోషల్ మీడియాలో సీసీ టీవీ ఫుటేజ్ వైరల్

by Shiva |   ( Updated:2024-05-22 12:09:04.0  )
BREAKING: ఈవీఎంలు ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి.. సోషల్ మీడియాలో సీసీ టీవీ ఫుటేజ్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మే 13న అంటే.. పోలింగ్‌ కొనసాగుతుండగానే ఓ పోలింగ్ కేంద్రంలోకి మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన వర్గీలు చొరబడి ఈవీఎంను ధ్వంసం చేసిన సీసీ టీవీ ఫుటేజీ తాజాగా బయటకు వచ్చింది. ఈ మేరకు ఆ వీడియోలో రెంటచింతల మండలం పాల్వాయి గేట్‌ వద్ద ఉణ్న పోలింగ్‌ కేంద్రం 202 లోకి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్‌ బూత్‌లోని సిబ్బందిని బెదిరించి అనంతరం అక్కడున్న ఈవీఎంను ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలింగ్‌ ఏజెంట్‌పైనా ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డాడు. అయితే ఆ దృశ్యాలన్ని వెబ్‌ క్యామ్‌లో రికార్డ్ కాగా.. సిట్‌ దర్యాప్తులో అవి వెలుగులోకి వచ్చాయి. ప్రస్తతం అందుకు సంబంధించిన వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

Click Here For Twitter Post..

Advertisement

Next Story