రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ఎన్ఐఏ సోదాలు

by Shamantha N |
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ఎన్ఐఏ సోదాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. పేలుడు కుట్రకు సహకరించిన వారిని గుర్తించేందుకు ఎన్ఐఏ ముమ్మరంగా విచారణ చేపడుతోంది. బెంగళూరులోని కుమారస్వామి లేఅవుట్, బనశంకరి ప్రాంతాల్లో దాడులు చేసినట్లు తెలిపారు అధికారులు. కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో దాడులు చేపట్టింది.

ఈకేసులో పలువురు అనుమానితులను గుర్తించిన ఎన్‌ఐఏ, డిజిటల్‌ పరికరాలు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. మర్చి 3న ఈకేసును ఎన్ఐఏ స్వీకరించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అద్బుల్ మతీన్ అహ్మద్ తాహాతో సహా ఇద్దరు కీలక నిందితులను ఏప్రిల్ 12న అరెస్టు చేసింది. కేఫ్‌లో బాంబును అమర్చింది తహాయేనని భావిస్తున్నారు. వీరిద్దరూ శివమొగ్గ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. తాజా సోదాల్లో భాగంగా 2012లో బెంగళూరు, హుబ్లీల్లో పేలుళ్ల కుట్ర కేసులో నిందితులుగా ఉన్నవారి ఇళ్లలోనూ ఎన్‌ఐఏ బృందం దాడులు చేసింది.

Advertisement

Next Story

Most Viewed