‘నా గోల్డ్ ఐఫోన్‌ తిరిగి ఇచ్చిన వారికి భారీ రివార్డ్: Urvashi Rautela

by Anjali |   ( Updated:2023-10-18 05:06:12.0  )
‘నా గోల్డ్ ఐఫోన్‌ తిరిగి ఇచ్చిన వారికి భారీ రివార్డ్: Urvashi Rautela
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన వరల్డ్ కప్‌లో భాగంగా ఊర్వశీ రౌతెలా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు హాజరైంది. మ్యాచ్ గెలవడంతో.. ఆనందంలో మునిగిపోయిన ఈ నటి.. అహ్మదాబాదులోని నరేంద్ర మోదీ స్టేడియంలో తన ఖరీదైన మొబైల్ పోగోట్టుకుంది. తాజాగా ఊర్వశీ ఫోన్ తిరిగి ఇచ్చినవారికి.. అలాగే ఫోన్‌ను కనుగొనడంలో హెల్ప్ చేసిన వారికి భారీ రివార్డ్ ఇస్తానంటూ ప్రకటించింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఈ పోస్టుకు పోలీసులు, స్టేడియం అధికారిక అకౌంట్స్‌ను కూడా ట్యాగ్ చేశారు. ఈ పోస్ట్ చూసిన జనాలు ‘పాపం ఊర్వశీ’ అంటూ పలు రకాల కామెంట్స్ పెడుతున్నారు. 24 క్యారెట్ల బంగారం తాపడం చేసిన మొబైల్ కావడంతో ఈ నటి తెగ బాధపడుతోంది.

Advertisement

Next Story